కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

కౌంటి

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

సూర్యాపేట, తిరుమలగిరి : మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, లోపాలకు తావుండరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాట్లను గురువారం ఎస్పీ నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామరావు, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు వేణుమాధవ్‌, సూర్యనారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమత్‌రెడ్డి, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్‌, రామారావు, తహసీల్దార్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తిరుమలగిరిలో అభ్యర్థులకు ఎన్నికల నియమా వళిపై అవగాహన కల్పించారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

టెన్త్‌ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి

సూర్యాపేట : టెన్త్‌ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమావేశమై ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని తీర్చిదిద్దాలన్నారు. ఫలితాల్లో వెనుకబడిన పాఠశాల లపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement