మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

మున్స

మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన సమన్వయం సాధించేందుకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కోఆర్డినేటర్లను నియమించింది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ నియమించారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోఆర్డినేటర్‌గా ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్‌రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు నూతి శ్రీకాంత్‌గౌడ్‌, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్‌యాదవ్‌, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్‌రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణ గౌడ్‌, చిట్యా లకు గౌరిసతీష్‌ను నియమించారు.

నర్సరీల పెంపకంలో

జాగ్రత్తలు తప్పనిసరి

మునగాల: నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని జెడ్పీ సీఈఓ శిరీష నిర్వాహకులకు సూచించారు. మునగాల మండలం నరసింహులగూడెంలో నర్సరీని గురువారం ఆమె సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌, కమ్యూనిటీ ప్రాంతాల్లో నాటేందుకు నర్సరీల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. వేసవిలో మొక్కల ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ రమేష్‌దీనదయాళ్‌, ఎంపీఓ నరేష్‌, ఏపీఓ శైలజ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌, ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కల్యాణి ఉన్నారు.

పోలీసు స్టేషన్‌ తనిఖీ

అర్వపల్లి: మండలంలోని నాగారం పోలీస్‌స్టేషన్‌ను గురువారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో కలిసి ఎస్సీ నరసింహ తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు పరిశీలించారు. స్టేషన్‌డైరీ, రిషెప్షన్‌ రిజిస్టర్లు తనిఖీ చేశారు. నమోదైన కేసులు, వాటి స్థితిగతులపై ఆరా తీశారు. బాధితుల ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ చిరంజీవి ఉన్నారు.

వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : పోలీస్‌ వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు వాహనాల డ్రైవర్లకు సఫారీ యూనిఫామ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులను సంఘటన స్థలాలకు, బాధితుల వద్దకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వాహనాలను కండీషన్‌లో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌ రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్‌కుమార్‌, పోలీస్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్‌ఎస్‌ఐ సురేష్‌, పోలీస్‌ సంక్షేమ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.

నృసింహుడి నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. మూలవిరాట్‌ను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం నిత్యహోమం, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం1
1/1

మున్సిపాలిటీలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement