
చట్టవ్యతిరేక పనులు చేయవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : చట్ట వ్యతిరేక పనులు చేయకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సబ్ జైలును ఆమె తనిఖి చేశారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైలు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఖైదీల తరఫున వాదించడానికి న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. లేకుంటే లీగల్ ఎయిడ్ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి, న్యాయసేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్