రేషన్‌ దందాలో ఆరితేరారు! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దందాలో ఆరితేరారు!

Apr 21 2025 8:15 AM | Updated on Apr 21 2025 8:15 AM

రేషన్

రేషన్‌ దందాలో ఆరితేరారు!

నెల రోజుల వ్యవధిలో 5 చోట్ల

పట్టుబడిన తమ్మర గ్రామవాసులు

అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ దందాను వదలని గ్రామస్తులు

పోలీసులు నిఘా పెంచడంలో

విఫలమవుతున్నారని విమర్శలు

కేసులు నమోదు చేస్తున్నాం

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిని ఇప్పటికే రిమాండ్‌ చేశాం. ఈ అక్రమ వ్యాపారం చేసేవారిపై బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్‌రోడ్‌, అన్నారం, గోండ్రియా, రెడ్లకుంటల వద్ద సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

రజితారెడ్డి, కోదాడరూరల్‌ సీఐ

కోదాడరూరల్‌ : కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర గ్రామం రేషన్‌ దందాకు కేరాఫ్‌ అడ్రాస్‌గా మారింది. గత నెల 17 నుంచి ఇప్పటివరకు ఆ గ్రామానికి చెందిన వారే రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడగా 5 కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామానికి చెందిన పలువురు ఈ రేషన్‌ బియ్యాన్ని గత 15 ఏళ్లుగా యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఒకొక్కరిపై అనేకసార్లు కేసులు నమోదైనప్పటికీ అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆటోల్లో సరిహద్దు దాటిస్తున్నారు

గతంలో లారీల్లో రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు దాటించేవారు. పెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే నష్టం జరుగుతుందని భావించిన రేషన్‌ వ్యాపారులు గత కొద్దికాలం వారి రూట్‌ మార్చారు. ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని లారీల్లో కాకుండా ఆటోల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు.

నిఘా పెట్టని పోలీసులు

చిలుకూరు, అనంతగిరి, కోదాడ, మోతె, నడిగూడెం గ్రామాల్లో కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామకు చెందిన రేషన్‌ మాఫియాకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని ఆటోల్లో జాతీయరహదారిపై కాకుండా మారుమూల గ్రామాల నుంచి వెళ్తూ రామాపురం క్రాస్‌రోడ్‌తో పాటు అన్నారం గ్రామాల మీదుగా రాష్ట్రం దాటిస్తున్నారు. అయితే సరిహద్దులో పోలీసులు నిఘా పెంచడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నెల రోజుల్లో 5 కేసులు ఆ గ్రామం వారిపైనే..

మార్చి 17 నుంచి ఇప్పటి వరకు నెల రోజుల వ్యవధిలోనే పలు స్టేషన్‌లో 5 రేషన్‌ బియ్యం అక్రమ సరఫరా కేసులు నమోదు కాగా పట్టుబడిన వారందరూ తమ్మర వారే కావడం గమనార్హం. మార్చి17న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమ్మరకు చెందిన రాముపై, అదే రోజు అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తమ్మరకు చెందిన ఉపేందర్‌, ఎస్‌.వీరబాబు 9 బస్తాల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 21న అనంతగిరి స్టేషన్‌ పరిధిలో తమ్మరకు చెందిన వెంకటలక్ష్మి, నరేష్‌ 4.5 క్వింటాళ్ల బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారు. మార్చి 25న మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద పట్టుబడిన బియ్యం తమ్మరకు చెందిన జానకిరాములివి. ఈ నెల 11న తమ్మరకు చెందిన షేక్‌. సికిందర్‌ కోదాడ మండలంలో నాలుగు క్వింటాళ్ల బిరయ్యాన్ని కొనుగోలు చేసి నందిగామకు తరలిస్తుండగా రూరల్‌ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇతనిపై ఇదివరకు కోదాడ టౌన్‌, రూరల్‌ స్టేషన్‌లో కేసులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రేషన్‌ బియ్యం గత నెల 17న కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని కోదాడ మున్సిపాలిటీ, అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తమ్మరకు చెందిన సుల్తానీ రాము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ఏపీలో విక్రయించేందుకు తరలిస్తుండగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.

గత నెల 25నెల కోదాడ మండల పరిధిలోని మొద్దుల చెర్వు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎంలో 30 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను తమ్మరలోని ఆర్‌.జానకిరాములు వద్ద కొనుగోలు చేసి సిద్ధిపేటలోని సంజయ్‌కు విక్రయించేందుకు తరలిస్తున్నానని తెలిపాడు. దీంతో డీసీఎంను సీజ్‌ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

రేషన్‌ దందాలో ఆరితేరారు!1
1/1

రేషన్‌ దందాలో ఆరితేరారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement