సాక్షి: కొత్త పార్టీలో చేరారు. ఈ కొత్త బాధ్యతలు ఎలా ఉన్నాయి?
లక్ష్మీదేవి: నిజమే. 40 ఏళ్ల పాటు నా భర్త అప్పలసూర్యనారాయణ రెండు సార్లు మంత్రిగా నూ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగానూ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ప్రజాసేవ చేశారు. ఆయనతోపాటుగా నేను ఇన్నాళ్లుగా అదే పార్టీలో ఉన్నా. ఇప్పుడు ఆయన మరణం తర్వాత పరిణామాలు మారాయి. గత నెల 22 తర్వాత నా కొత్త రాజకీయ ప్రయాణం మొదలైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆయన ఇచ్చిన అవకాశంతో కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేస్తున్నా.
సాక్షి: ప్రచారం ఎలా సాగుతోంది? ఈ ఎన్నికల్లో మేయర్‌గా గెలిస్తే మీరు ఏం చేస్తారు?
లక్ష్మీదేవి: నగరంలో 1.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు అందరికీ నేను పరిచయమే. ప్రచారానికి వెళ్తుంటే ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అందుకే తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఉంది. నగరంలోని మొత్తం 60 డివిజన్లలో వైఎస్సార్సీపీకి పట్టు ఉంది. 60 డివిజన్లలోనూ అన్నయ్య ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలోనే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక నా సొంత ఊరు అరసవల్లితో పా టు నగరంలోని ప్రజలంతా నా కుటుంబసభ్యుల్లా భావిస్తాను. తొలి మేయర్‌గా పీఠంలో కూర్చునేలా ప్రజా దేవుళ్ల ఆశీస్సులుండాలని కోరుకుంటున్నా. మేయర్‌గా గెలిస్తే ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను. నగర ప్రజలకు అమ్మలాంటి పాలనను అందిస్తాను.
సాక్షి: ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై జనం ఏమంటున్నారు..?
లక్ష్మీదేవి: నియోజకవర్గంలో పలు గ్రామాలతో పాటు ఇప్పుడు నగరంలోనూ పర్యటిస్తున్నా ను. నిత్యావసర ధరలు దారుణంగా పెంచేశారంటూ జనం మండిపడుతున్నారు. ఎన్న డూ వినని రీతిలో 25 కిలోల బియ్యం ధర రూ.2400, లీటర్ వంట నూనె రూ.189, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బండ దాదాపు వెయ్యి, చక్కెర ధర ఎన్నడూ లేని విధంగా కిలో రూ.100, కందిప ప్పు కిలో రూ.152 ఇలా.. దాదాపుగా అన్ని నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోల్చితే ఇప్పటి రేట్లు 70 శాతం పెరిగాయని జనం బెంబేలెత్తుతున్నారు. అలాగే దౌర్జన్యాలు, బెదిరింపులు, గంజాయి వినియోగం బాగా పెరిగి అర్బన్‌లో కూడా క్రైం రేట్ విపరీతంగా పెరిగిపోయింది. జనం చా లా భయాందోళనల మధ్య జీవనాన్ని సాగిస్తున్నారు. జనం ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పాలని ఎదురుచూస్తున్నారు.
సాక్షి: ధర్మాన అండదండలు ఎలా ఉన్నాయి?
లక్ష్మీదేవి: నేను, దాసన్న, ప్రసాదన్నలు కజిన్స్. అయితే రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉండడంతో కొంత గ్యాప్ ఉండేది. అయితే నా భర్త చనిపోయాక మేము నమ్ముకున్న పార్టీ మాకు వెన్నుపోటు పొడిచి, మోసం చేసినప్పుడు నా కుటుంబాన్ని ఒంటరి చేస్తున్న తరుణంలో ధర్మాన ప్రసాద్ అన్నయ్య, దాసన్నలు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. వారి అండదండలతోనే వైఎస్సార్సీపీలో చేరాను. వారి ఆదరణ ఎప్పటికీ మరువలేను. వారి ప్రోత్సాహంతోనే వైఎస్ జగన్‌ను కలిశాను. తల్లిలా నన్ను చాలా గౌరవించారు. మనసు తేలికపడింది. మేము ఏ గౌరవమైతే కోరుకున్నామో అదే ఆయన మాకు ఇచ్చారు. చాలు.. అదే విశ్వాసంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తాం.
సాక్షి: మీ భర్తకు, మీకు జరిగిన అవమానాలపై?
లక్ష్మీదేవి: ‘లక్ష్మీ.. మనం తెలుగుదేశం పార్టీకి ఏం ద్రోహం చేశాం.. ఇంతలా మనల్ని వేధిస్తున్నారు. ఒంటరి చేస్తున్నారు..? 40 ఏళ్ల నా క్రమశిక్షణకు పార్టీ నాకిచ్చిన బహుమానం ఇదా..? అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వ కుండా అవమానించారు సరికదా.. ఆఖరికి నాకు పెద్ద సర్జరీ జరిగినప్పటికీ సొంత పార్టీ పెద్దలు గానీ, జిల్లా నేతలు గానీ ఒక్కరైనా పరామర్శించలేదంటే.. అంతలా ఏం తప్పు చేశాం’ అంటూ నా భర్త అప్పలసూర్యనారాయణ గారు చాలా సార్లు నా దగ్గర, అలాగే నా ఇద్దరు పిల్లల వద్ద కూడా అన్నా రు. దీని వల్ల మన శ్శాంతిని కోల్పోయి మనోవేదనకు గురయ్యారు. దాని వల్లే ఆయన తనువు చాలించా రు. ఆయన అన్న మాటలను నేను ఎప్పటికీ మరువలేను. నా భర్తను, నన్ను తీవ్ర అవమానాలకు గురిచేసిన వారికి కర్మ విడిచిపెట్టదు. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తుంది.
సాక్షి: విగ్రహాల దిమ్మలను కూల్చేయడంపై మీ స్పందన?
లక్ష్మీదేవి: నా భర్త చనిపోగానే.. నగరంలో ఏడు రోడ్ల కూడలిలో, అలాగే అరసవల్లి మిల్లు కూడలిలో ఆయన విగ్ర హాలను ఏర్పాటు చేస్తామని మా ఇద్దరు పిల్ల లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించారు. ఆయన అంగీకరించి కలెక్టర్‌ను కలవమన్నారు. కలెక్టర్ కూడా సమ్మతించా రు. తీరా దిమ్మలను కడితే.. అనుమతి లే దంటూ మున్సిపల్ సిబ్బందితో అధికార పార్టీ నేతలు దగ్గరుండి కూల్చేశారు. అనుమతులున్నాయని చెప్పి మళ్లీ దిమ్మలు కడితే కూ డా కూల్చేశారు. అదే నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇప్పుడు ఆగమేఘాల మీద నా భర్త విగ్రహం పెట్టేసి తన రాజకీయాలకు వాడుకుంటున్న ఎమ్మెల్యే తీరును ప్రజలంతా గమనిస్తున్నారు. నా భర్త చనిపోవడానికి పరో క్ష కారకులే ఇప్పుడు విగ్రహాలు పెట్టేసి గురువుగారూ అంటూ దొంగ నివాళ్లు అర్పిస్తే ప్రజలు నమ్మేస్తారా చెప్పండి.
సాక్షి: ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
లక్ష్మీదేవి: రాజకీయాలు సేవలా చూడాలి. వ్యాపారాల్లా కాదు. 45 ఏళ్లుగా నా కుటుంబం నీతి నిజాయితీతో ఏ మచ్చ లేని రాజకీయాలు చేసింది. నా అనుభవం చూసి నన్ను నమ్మి, వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా నాకు ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేసి గెలిపించి మేయర్ చేయాలని కోరుకుంటున్నాను. నగరంలోని 1.57 లక్షల మందికి అమ్మలాంటి పరిపాలన చూపించి.. నా రుణం తీర్చుకుంటాను. ఆప్యాయతతో కూడిన పాలనకు.. అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి.
శ్రీకాకుళాన్ని కార్పొరేషన్‌గా హోదా పెంచిన అనుభవం నాది
నగర అభివృద్ధికి నవరత్నాలు రూపొందించా
ధర్మాన సోదరుల ఆదరణ మరువలేనిది
వైఎస్ జగన్ తల్లిలా గౌరవించారు
‘సాక్షి’తో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి
సాక్షి: నగర అభివృద్ధికి ప్రణాళిక ఉందా.?
లక్ష్మీదేవి: నగరాభివృద్ధికి నవ రత్నాలను సిద్ధం చేశాను. 1. అవినీతి రహిత పాలన 2. మౌలిక వసతుల అభివృద్ధి, 3. సురక్షిత తాగునీరు 4. డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి, ముంపు నివారణ, 5. యువతకు విద్య ఉపాధి అవకాశాలు, శిక్షణ, 6. క్లీన్ అండ్ గ్రీన్ శ్రీకాకుళం, 7. వ్యాపారులకు తోడ్పాటు, 8. వృద్ధాప్య సంక్షేమం, 9. కార్మికుల సంక్షేమం. ప్రధాన హామీలుగా సంకల్పిస్తున్నాను.
వైఎస్ జగన్‌ను కలిశాను. తల్లిలా నన్ను చాలా గౌరవించారు. మనసు తేలికపడింది. మేము ఏ గౌరవమైతే కోరుకున్నామో అదే ఆయన మాకు ఇచ్చారు. చాలు.. అదే విశ్వాసంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తా.


