చలో ఢిల్లీ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

చలో ఢిల్లీ విజయవంతం చేయండి

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

ఎచ్చెర్ల : కార్మికులందరికీ కనీస వేతనాలు రూ.42 వేలు అమలు చేయాలని, లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని తదితర డిమాండ్లతో డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్‌ల్ర కార్యదర్శి ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. మంగళవారం ఎచ్చెర్లలోని ఐఎంఎల్‌ డిపో వద్ద పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్యులు కట్టిన పన్నులతో ఎదురు రాయితీలు ఇచ్చి మరింత సంపన్నులను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, వీవోఏ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీబీసీఎల్‌, ఐఎంఎల్‌ ఎచ్చెర్ల డిపో హమాలీస్‌ యూనియన్‌ నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు, ఎల్‌.సీతారాం, పి.రామారావు, ఎల్‌.సీతారాం, పి.రామారావు, ఎల్‌.రాము, ఎన్‌.గోవింద, ఎం.రాజారావు, ఎన్‌.సంజీవ్‌, గన్నమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement