● పన్ను పోటు.. | - | Sakshi
Sakshi News home page

● పన్ను పోటు..

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

ఇంటి పన్నులను కూడా చంద్రబాబు వదలడం లేదు. ఏటా 15శాతం పేరుతో పెంచుకుని వెళ్లిపోతున్నారు. ఒక్క రోజు ఆలస్యమైనా నెలకు 2శా తం చొప్పున (ఏడాదికి 24శాతం) వడ్డీ లేదా అపరాధ రుసుం పడుతోంది. దీంతో సామాన్యులు అద్దె ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక్క శ్రీకాకుళంలోనే రూ.4.5కోట్ల మేర అదనపు భారం మోపారు. ఆమదాలవలసలో 150శాతం మేరకు ఆస్తి పన్ను పెంచారు. అప్పటివరకు రూ. 300చెల్లించే వారికి రూ. 1000 వరకు పన్ను పడింది. ఇప్పుడు ఏటా 15శాతం పెంచుకుని పోతుండటంతో తట్టుకోలేకపోతున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకునేటప్పుడు కేవలం ప్లాన్‌ ఫీజు మాత్రమే కాకుండా డెవలప్‌మెంట్‌ చార్జీలు, బెటర్‌మెంట్‌ చార్జీలు, 14శాతం ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు, లేబర్‌ సెస్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. వీటికి లంచాలు అదనం.

● బాబు అధికారంలోకి వచ్చిన

ప్రతిసారీ ప్రజలకు వాతలే

● ఎన్నికలకు ముందు ధరలు

పెంచబోమని హామీలు

● ఎన్నికల తర్వాత

పెంచక తప్పడం లేదంటూ కబుర్లు

కరెంటు బిల్లులు శీతాకాలంలోనూ చెమట్లు పట్టిస్తాయి. ఆస్తి పన్నులు చాప కింద నీరులా పెరిగిపోతాయి. నిత్యావసరాల ధరలు సామాన్యుడి స్థాయిని దాటి ఎగబాకుతుంటాయి. ఆఖరుకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు సైతం నొప్పి తెలియకుండా రక్తాన్ని పిండేస్తుంటాయి. మార్కెట్‌లో ధరలు సగటు జీవిని వెక్కిరిస్తున్నాయంటే చంద్రబాబు అధికారంలో ఉన్నట్టే లెక్క. ఆయన ఎప్పుడు కుర్చీ ఎక్కినా సగటు జీవి జేబుకు చిల్లు పడక తప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితీ అలాగే ఉంది.

– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

● విద్యుత్‌ వాత

అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే తగ్గిస్తామని, వినియోగదారులే విద్యుత్‌ అమ్ముకునేలా చేస్తామని చంద్రబాబు ప్రగల్బాలు పలికారు. తొలి ఏడాదిలోనే విద్యుత్‌ చార్జీలు వడ్డించగా, రెండో ఏడాది కూడా అదే బాదుడుకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నగరంలో 87,762 సర్వీసులుండగా 2024 ఏప్రిల్‌ నాటికి నెలకి రూ.5.46కోట్లు బిల్లులు రాగా, 2026 అక్టోబర్‌లో ఆ బిల్లులు రూ.10.03కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ. 4.57కోట్ల అదనపు భారం మోపినట్టైంది. దీనికి తోడు కోతలూ తప్పడం లేదు. ఆయన 2015–16లోనూ విద్యుత్‌ చార్జీలు పెంచారు. 50యూనిట్ల లోపు గల వారికి యూనిట్‌కు రూ.1.45పైసలు, 100యూనిట్ల లోపు వారికి యూనిట్‌కు రూ. 2.60పైసలు, వాణిజ్య అవసరాల కనెక్షన్ల వారీగా యూనిట్‌కు 18 పైసలు, పరిశ్రమల వారికి యూనిట్‌కు 13పైసలు, నీటి సరఫరాకు యూనిట్లకు యూనిట్‌కి 11నుంచి 13పైసలు, పాఠశాలలు, హాస్టల్స్‌కు యూనిట్‌కి 14పైసలు పెంచారు. ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిని ఫాలో అయిపోతున్నారు.

● బడుగులపైనే బాదుడు

ప్రకటనల పన్నులు భారీగా పెంచారు. గతంలో చిన్న చిన్న షాపులకు పెట్టుకునే డిస్‌ ప్లే బోర్డులకు ప్రకటనల పన్ను వేస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆశీలు పన్నులు కూడా విపరీతంగా పెంచేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు అమ్ముకునేందుకు రైతులొస్తే నడిరోడ్డుపై మీద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు పెంచాల్సి రావడంతో కొనుగోలు దారులకు భారంగా మారుతోంది. ఇక దుకాణాలు నడుపుకునే వారికి ట్రేడ్‌ లైసెన్స్‌ల పేరుతో ఏటా ఫీజులు, సకాలంలో రెన్యువల్‌ చేయకపోతే భారీ జరిమానాలు విధిస్తున్నారు. సచివాలయాలు, మీసేవ లేదా మున్సిపల్‌ పోర్టల్‌ ద్వారా పన్నులు చెల్లించేటప్పుడు, దరఖాస్తులు చేసుకునేటప్పుడు పేమెంట్‌ గేట్‌వే చార్జీలు, యూజర్‌ సర్వీస్‌ చార్జీల పేరుతో అదనపు రుసుము పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement