తొలి విడత | - | Sakshi
Sakshi News home page

తొలి విడత

Nov 18 2026 1:08 AM | Updated on Nov 18 2026 1:08 AM

శ్రీకాకుళంలో 466 వార్డు నామినేషన్లకు ఆమోదం

న్యూస్‌రీల్‌

అరసవల్లి: తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తొలివిడతలో 7 మండలాల్లో 194 పంచాయతీ సర్పంచ్‌లకు 1039, మొత్తం 1922 వార్డులకు 3546 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్ఛాపురంలో సర్పంచ్‌లకు 138, వార్డులకు 363, కంచిలిలో సర్పంచ్‌లకు 144, వార్డులకు 477, కవిటిలో సర్పంచ్‌లకు 146, వార్డులకు 356, సోంపేటలో సర్పంచ్‌లకు 151, వార్డులకు 597, పలాసలో సర్పంచ్‌లకు 75, వార్డులకు 298, మందసలో సర్పంచ్‌లకు 196, వార్డులకు 816, వజ్రపుకొత్తూరులో సర్పంచ్‌లకు 189, వార్డు సభ్యులకు 639 నామినేషన్లు పడ్డాయి.

శ్రీకాకుళం: నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా ముగియగా, 60 డివిజన్ల కార్పొరేటర్‌ స్థానాలకు దాఖలైన మొత్తం 466 నామినేషన్లు ఆమోదం పొందినట్లు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రవణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించిన పరిశీలనలో ఏ ఒక్క వార్డు నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురికాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మేయర్‌ పదవికి సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం 10 మంది అ భ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టర్‌ ఫారం–8 ద్వారా ప్రకటించారు.

ఆమదాలవలసలో అన్నీ సక్రమమే

ఆమదాలవలస: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్లన్నీ సక్రమంగా ఉ న్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నా మినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 28 వార్డులకు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 148 నామినేషన్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఆరు నామినేషన్లు కలిపి మొత్తం 154 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా అన్నీ సక్రమంగా ఉన్నట్లు గుర్తించారని కమిషనర్‌ వెల్లడించారు.

మొత్తం నామినేషన్లు 4585

సర్పంచ్‌లకు 1039, వార్డులకు 3546

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement