శ్రీకాకుళం క్రైమ్ : రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు శ్రీకాకుళం నగరపాలక, ఆమదాలవలస పురపాలక సంస్థల ఎన్నికల్లో అక్రమ మద్యం, నాటుసారా, ఇతర ఎకై ్సజ్ నేరాలను పూర్తిగా అరికడతామని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాహుల్‌దేవ్ శర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ చమకూరితో కలిసి నగరంలోని ఓ హోటల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం–మన్యం జిల్లాల ఎకై ్సజ్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ బెల్టు షాపులను నియంత్రిస్తామని, ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహిహిస్తామన్నారు. అక్రమ మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, లైసెన్సు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీకాకుళం ఐఎంఎఫ్ఎల్ డిపోను తనిఖీ చేసి స్టాక్ నిర్వహణ, రికార్డులను పరిశీలించి మద్యం దుకాణాలకు సకాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో మూడు జిల్లాల సంబంధిత శాఖ డిప్యూటీ కమిషనర్లు సుర్జీత్‌సింగ్, శ్రీ,నివాస్చౌదరి, అసిస్టెంట్ కమిషనర్లు మనోహ, రామచంద్రరావు, సూపరింటెండెంట్లు సీహెచ్ తిరుపతినాయుడు, శ్రీనాధుడు, సహదేవుడు, డిపో మేనేజర్ జయసింహచౌదరి మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు.


