భయపెట్టి గెలిచారే తప్ప.. వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు | - | Sakshi
Sakshi News home page

భయపెట్టి గెలిచారే తప్ప.. వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

భయపెట్టి గెలిచారే తప్ప.. వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓటర్లను భయపెట్టారు

విలేకరులతో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నేతలు

ఇచ్ఛాపురం రూరల్‌: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కూటమి సాధించిన విజయం ప్రజల స్వచ్ఛంద మద్ధతుతో లభించినది కాదని, ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పొందిన విజయమని వైస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ విమర్శించారు. శుక్రవా రం ఇచ్ఛాపురంలోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులకు ఓటు వేయకపోతే సామాజిక భద్రత పింఛన్లు తొలిగిస్తామని, కొత్త పింఛన్లు, హౌసింగ్‌ రుణాలు నిలిపివేస్తామని, పోలీసు కేసులతో వేధిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. చిరు వ్యాపారాలపై దాడులు చేసి భయపెట్టారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులను చూసి, వారి పనితీరును మెచ్చి ప్రజలు ఓటు వేశా రని చెప్పుకోవడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగిందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించినా, పక్కా తారురోడ్లు ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు వెల్లడం లేదన్నారు.తుఫాన్లు, భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నా రైతులకు పరిహారం అందడం లేదన్నారు. అర్నాబ్‌ తుఫాన్‌ సమయంలో అతలాకుతలమైన ఇచ్ఛాపురం మండలాన్ని కనీసం పరిశీలించలేదని మండిపడ్డారు.

భయపెట్టినా ఫ్యాన్‌కే ఓటు..

కూటమి అభ్యర్థులను చూసి ప్రజలు ఓటు వేయలేదని, కేవలం భయపెట్టడం వల్లే కొందరు ఓటు వేశారని నాయకులు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీ పీ ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగిందన్నారు. అధికా ర పార్టీ బెదిరింపులకు లొంగకుండా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర, మండల, పట్టణ పార్టీ అధ్యక్షు లు ఆశి కృష్ణారెడ్డి, ప్రకాశరావు పట్నాయక్‌, ఆశి పురుషోత్తమరెడ్డి, పిలక దేవరాజు, మాజీ జెడ్పీటీసీ దక్కత నూకయ్యరెడ్డి, సుగ్గు ప్రేమ్‌కుమార్‌, రంగాల జానకిరామ్‌, నర్తు వరప్రసాద్‌, కాళ్ల ధర్మ తేజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement