నేటి నుంచి బాలల చలన చిత్రోత్సవం
లివిగా నడుచుకుందాం
ఇచ్ఛాపురం రూరల్:
బాలల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వారి రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై జనాలకు అవగాహన అంతంతమాత్రమే. నేడు బాలల దినోత్సవం. ఈ రోజైనా ఆ చట్టాల గురించి అవగాహన పెంచుకుందాం.
బాలకార్మిక చట్టం
విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలు బడిలో మాత్రమే ఉండాలి. గనులు, ఇటుక బట్టీలు, హైరిస్క్ ప్రాంతాలు, కిరాణా షాపుల్లో బాలల చేత పనులు చేయించరాదు. బాలకార్మిక చట్టం 1986, రూల్–2బి ప్రకారం ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పనిచేయరాదు. పెద్దలు చేసే పనికి ప్రత్యామ్నాయంగా పిల్లు పని చేయరాదు. చట్టానికి వ్యతిరేకంగా బాలల చేత పనులు చేయిస్తే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం
బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 సెక్షన్ 2(ఎ) ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయి, 21 ఏళ్లు నిండని అబ్బాయిని బాల్య దశలో ఉన్నట్లుగా భావిస్తారు. బాల్య వివాహంలో యుక్త వయస్సు ఉన్న పురుషుడు, బాలిక తల్లిదండ్రులు, సంరక్షకులు, వివాహాన్ని జరిపించినా, ప్రోత్సహించినా ఆ వ్యక్తులు, వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు దోషులే. వీరికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు.
పోక్సో చట్టం
పిల్లలపై లైంగిక దాడి చేయడం, అవమానించడం, వేధించడం నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (పోక్సో)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పిల్లలపై నేరానికి పాల్పడిన వారికి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
బాలల సంరక్షణ చట్టం
నేరారోపణ ఎదుర్కొంటున్న బాలలతో పాటు నేరం చేసినట్లు రుజువైన బాలల సంరక్షణ, వారి పోషణ, అవసరమైన పిల్లలకు వారి ప్రాథమిక అవ సరాలు తీర్చడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం, పునరావాసం, వారికి అవసరమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడం కోసం చేసిన చట్టాలను ఏకం చేస్తూ సవరించిన చట్టం ఇది. ఈ చట్టం ద్వారా అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడిన బాలలకు సరైన రక్షణ, సంరక్షణ దొరుకుతుంది.
ఇచ్ఛాపురం రూరల్ : ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఇచ్ఛాపురం జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ నెల 14 నుంచి స్కూల్ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్–2026 నిర్వహించనున్నట్లు పాఠశాల కార్యదర్శి జోహర్ఖాన్ తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 50 దేశాలకు చెందిన 20కి పైగా భాషల్లో రూపొందించిన 109 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణంలో భారీ ఎల్ఈడీ తెరలను సిద్ధం చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఫిలిం ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు.


