వజ్రపుకొత్తూరు ఏపీఎం అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

వజ్రపుకొత్తూరు ఏపీఎం అత్యుత్సాహం

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

సాక్షి టాస్క్‌ఫోర్సు: వజ్రపుకొత్తూరు ఏపీఎం గొడబ ప్రసాదరావు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు. ఎన్నికల నియమావళి ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించి బుధవారం పొల్లాడ, దేవునల్తాడ సీఎఫ్‌లతో పాటు మరికొంత మంది సీఎఫ్‌లను వెంటబెట్టుకుని జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపొందిన గుంటు విజయ్‌కుమార్‌, గోవిందపురం ఎంపీటీసీగా గెలిపొందిన శోభారాణిలను దేవునల్తాడ, గోవిందపురంలోని వారి స్వగృహంలో బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్‌ ఉండగా బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ కార్యకర్తలా ప్రవర్తించడం గమనార్హం. ఏపీఎం మొదటినుంచీ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఈయన గత రెండేళ్లుగా అధికారి కూటమి నేతలతో అంటకాగడం, వారి అండదండలు ఉన్నాయన్న కారణంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన వ్యవహార శైలిపై ప్రతిపక్ష నేతలతో పాటు, కొంతమంది సామాజికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంపై సీ–విజల్‌ యాప్‌తో పాటు, ఎన్నికల కమిషన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950 కాల్‌ సెంటర్‌కి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ అధికారిపై ఎన్నికల కమిషన్‌తో పాటు, జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో ఎన్‌.రమేష్‌ నాయుడును వివరణ కోరగా.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని ప్రభుత్వ అధికారులు ఉల్లంఘన చేయకూడదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement