అంబేడ్కర్‌ ఆలోచనలు ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆలోచనలు ఆచరణీయం

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

ఎచ్చెర్ల: దేశ ప్రజాస్వామ్యానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానం ఎప్పుడూ అవసరమేనని ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ ప్రొఫెసర్‌ పెరికల కేశవకుమార్‌ అన్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలన్నింటికీ ఆయన ఆలోచన విధానాలే ప్రేరణ అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే అంశంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బుధవారం ప్రారంభమైన రెండురోజుల జాతీయ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంతో అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాలకు, అంబేడ్కర్‌ భావజాలానికి మధ్య సంబంధాలను ఆయన వివరించారు. అంబేడ్కర్‌ ప్రవచించిన తాత్విక సిద్దాంతంతోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో ఆధిపత్యం, అణచివేత, హక్కుల ఉల్లంఘన కొనసాగినంతకాలం అంబేడ్కర్‌ అవసరం మరింతగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన యోగి వేమన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో చాలామందికి అంబేడ్కర్‌ రోల్‌ మోడల్‌గా ఉన్నారన్నారు. ఆయన సమాజాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి సమస్యలకు పరిష్కారం చూపించారని కొనియాడారు. బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ఆర్‌.రజనీ మాట్లాడుతూ అంబేడ్కర్‌ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చదువుకు అంబేడ్కర్‌ ఇచ్చిన ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, అంబేడ్కర్‌ స్టడీ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ జి.పద్మారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్‌పై ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement