గార : జాతీయ బాలహిత గ్రామ పురస్కారానికి బోరవానిపేట పంచాయతీ నామినేట్ అయిన నేపథ్యంలో గురువారం కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ప్రైమరీ పాఠశాలలో వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లు, మౌలిక వసతులు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఆరాతీశారు. బాలల హక్కుల పరిరక్షణ, సంపూర్ణ విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహార భద్రత, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాల్లో పంచాయతీ సాధించిన ప్రగతిని కేంద్ర బృందం పరిశీలించనుందని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, డిప్యూటీ సీఈఓ కె.సౌమ్య, డీపీఓ ఆర్.స్వరూపారాణి, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి పీఎస్‌జీ బాలకృష్ణ పాల్గొన్నారు.
డిసెంబర్ 12న లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రెండో అదనపు జిల్లా జడ్జి బి.సాదుబాబు తెలిపారు. ఈ మేరకు జిల్లా కోర్టు సముదాయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ అన్ని న్యాయస్థానాల్లోనూ రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు న్యాయశాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. అదాలత్‌లో పరిష్కారమైన కేసులకు సంబంధించి చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి సీహెచ్. వివేక్ ఆనంద్ శ్రీనివాస్, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్.సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయమూర్తులు కె.అనురాగ్, కె.ఎం.జామృత్ బేగం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు, ఎక్సై జ్ శాఖ అధికారులు, ఏపీఈపీడీసీఎల్ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
సోంపేట: బారువ గ్రామానికి చెందిన మాడుగల ధర్మేంద్ర వర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయమని సోంపేటలోని లోకనాధేశ్వర టైలర్ సహకార సంఘ సభ్యులు అన్నారు. బారువకు చెందిన లోకనాధేశ్వర సంఘ సభ్యుడు తారకేశ్వరరావు కుమారుడు ధర్మేంద్ర వర్మ ఇటీవల ఢిల్లీలో కళంకారి చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు. బుధవారం బారువ చేరుకున్న ధర్మేంద్ర వర్మను సంఘ ప్రతినిధులు దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు భత్తుల హేమంత్, దుంప రమేష్, ఆట్ల చంద్రరావు, దేవా, సాహుకారి జానీ తదితరులు పాల్గొన్నారు.
స్కూల్‌గేమ్స్ స్కేటింగ్ ఎంపిక పోటీలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–11, 14, 17, 19 బాలబాలికల స్కేటింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేటలోని ధ్యాన్‌చంద్ స్కేటింగ్ క్లబ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. క్వాడ్ స్కాట్స్, ప్రో ఇన్లినే అంశాల్లో సాధన చేస్తున్నవారు మాత్రమే హాజరుకావాలని కోరారు. వివరాలకు 9705462218, 9290905399 నంబర్లను సంప్రదించాలని కోరారు.


