అవగాహన లేక.. విశిష్టత కానరాక.. | - | Sakshi
Sakshi News home page

అవగాహన లేక.. విశిష్టత కానరాక..

Nov 12 2026 3:30 AM | Updated on Nov 12 2026 3:30 AM

●

● జిల్లాలో శతశాతం లక్ష్యం చేరని ఫార్మర్‌ రిజిస్ట్రీ

● విశిష్ట సంఖ్యకు నోచుకోని 52,936 మంది రైతులు

● వ్యవసాయ, రెవెన్యూశాఖల మధ్య

సమన్వయ లోపం

అవరోధాలు అధిగమిస్తున్నాం..

క్షేత్రస్థాయిలో ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదుకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సిబ్బంది వెళ్లే సమయంలో రైతులు అందుబాటులో ఉండటం లేదు. ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకా 52,936 మంది ఫార్మర్‌ రిజిస్ట్రీకి దూరంగా ఉన్నారు. వారిని గుర్తిస్తాం. – వై.వి.మురళీకృష్ణ,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

కాశీబుగ్గ /శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): అన్నదాతలకు అన్ని రకాల సేవలు ఒకేచోట అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 11 అంకెల విశిష్ట సంఖ్యను అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అందాలంటే ఏపీ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఏపీఎఫ్‌ఆర్‌)కు సంబంధించి 11 అంకెల రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి. పీఎం కిసాన్‌ పెట్టుబడిసాయం పొందాలన్నా, అన్నదాత సుఖీభవ వర్తించాలన్నా, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందుకోవాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రీ విధిగా ఉండాలి. అయితే ఈ సంఖ్యను రైతుకు వర్తింపజేయడంలో అటు వ్యవసాయ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య కొరవడిన సమన్వయం విశిష్ట సంఖ్య ప్రక్రియకు ప్రతిబంధకంగా మారుతోంది.

ఎల్పీఎంలతో అవస్థలు..

భూముల రీసర్వే నేపథ్యంలో జాయింట్‌ ఎల్పీఎంలు ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో వేల మంది రైతులు ఈ సమస్యలతో నలిగిపోతున్నారు. కొందరు రైతులకు సంబంధించి భూములున్నా.. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకుల ద్వారా రైతుకు విశిష్ట సంఖ్య నమోదు చేస్తున్నారు. సిబ్బందికి ఇతర పనులు అప్పగించడంతో నమోదులో జాప్యం జరుగుతోంది. ఆధార్‌తో అనుసంధానమైన రైతుల ఫోన్‌ నంబర్లు పనిచేయకపోవడం మరో సమస్యగా మారింది.

కొరవడిన చొరవ..

వివరాల నమోదులో భాగంగా రైతు చరవాణికి మూడుసార్లు ఓటీపీ వస్తుంది. మొదట ఆధార్‌, తర్వాత మొబైల్‌ నంబరు, మూడోసారి భూ సర్వే నంబరుతో లాగిన్‌ అవుతుంది. నమోదు పూర్తయితే వీఆర్వో, తహసీల్దారు లాగిన్‌కు వెళ్లాక వారు ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియకు రోజుల తరబడి సమ యం పడుతోంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి సారించక పోవడంతో వేలాది మంది రైతులకు విశిష్ట సంఖ్య రాలేదు. జిల్లాలో 3.61 లక్షల మంది రైతులకు గాను ఇప్పటిదాకా 3.08లక్షలు మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మిగిలిన వారు కూడా నమోదు చేసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement