శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. రెండు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు పరిసర ప్రాంతాల్లో 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో మూడంచెల భద్రతతో సజావుగా లెక్కింపు సాగిందన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని, కౌంటింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, కౌంటింగ్ ఏజెంట్ల ప్రవే శం పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత పోస్టులు పెట్టకూడదన్నారు.


