సొంత నేతలకే సంపద సృష్టి | - | Sakshi
Sakshi News home page

సొంత నేతలకే సంపద సృష్టి

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

నదులను చేతబట్టి

మడపాంలో తవ్విన ఇసుకను లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

అధికారమిచ్చింది వనరుల దోపిడీకా..!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

టీడీపీ నేతలకు ఇసుక పంట పండింది. అధికారంలో చేతిలోకి వచ్చిన మరునాటి నుంచే నదులను దోచేయడం మొదలుపెట్టారు. జిల్లాలో దాదా పు రూ.వెయ్యి కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సమాచారం. వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో ఎక్కడికక్కడ అక్రమ తవ్వకాలు చేపట్టి, టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో పర్యావరణానికి తూట్లు పొడిచారు. నదుల్లో అడ్డగోలు తవ్వకాలతో నదుల గమనం మారిపోయింది.భూగర్భ జలాలు అడుగంటిపోయి నదీ జలాలు కలుషితమయ్యాయి. వరద నీటితో తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇసుక రవాణాతో రోడ్లు శిథిలమయ్యాయి. పట్టణాలు, గ్రామాలు ఇసుక ధూళితో కాలుష్యం బారిన పడ్డాయి. నేతలకు జేబులు నిండగా, ప్రజలకు కష్టాలు వచ్చాయి.

జిల్లాలో టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక ర్యాంపు లు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అనధికార ర్యాంపులు నిర్వహించారు. వంశధార, నాగావళి నదుల్లో తాగునీటి పైపులు, తాగునీటి బావులు, వంతెనలు, పర్యావరణం సమస్యలను చూడకుండా ఇష్టారీతిన ఇసుకను తోడేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే సూత్రధారులు కాగా, మరికొన్ని చోట్ల వారి అనుయాయులు ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. గతంలో రాత్రిపూటే తవ్వకాలు జరిపేశారు. ఇప్పుడు అఽధికారులు తనిఖీలు, నిఘా లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా నదులను గుల్ల చేసేస్తున్నారు. అక్కడకక్కడా ఉన్న డీసిల్టేషన్‌ పాయింట్ల ముసుగులో మిగతా చోట్ల తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలతో నిర్వాహకులకు రూ. కోట్లు కుమ్మరిస్తుంటే.. వారికి సహకరిస్తున్న అధికార వర్గాలకు జేబులు నిండుతున్నాయి. దీంతో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

శ్రీకాకుళంలో ఇలా..

● వంశధారనదిలో శ్రీకాకుళం మండలం పొన్నాం, బట్టేరు, నైరా, బైరి, కరజాడ, గార మండల కేంద్రంలో జరుగుతున్నాయి.

● నాగావళి నదిలో కిల్లిపాలెంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

ఆమదాలవలసలో..

● ఆమదాలవలస మండలంలోని నాగావళి నదిలో నిమ్మ తొర్లువాడ, తొగరాం, ముద్దాడపేట, కొత్తవలస, దూసి, గోపీనగరం, తోటాడ, అక్కివరం యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వంశధార నదిలో చవ్వాకులపేటలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

● సరుబుజ్జిలి మండలంలోని వంశధార నదిలో పురుషోత్తపురంలో రెండు చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

● బూర్జ మండలంలోని నాగావళి నదిలో నారాయణపురం, కాఖండ్యాం, అల్లిన గ్రామా ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

● పొందూరు మండలంలోని నాగావళి నదిలో సింగూరు, బొడ్డేపల్లి గ్రామాల్లో ఇసుక దోపిడీ దర్జాగా సాగిపోతోంది.

పాతపట్నంలో..

● కొత్తూరు మండలం వంశధార నదిలో బంకి, వస ప, ఆకుల తంపర, మాతల, పొన్నుటూరు గ్రామా ల్లో యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి.

● హిరమండలం మండలంలోని వంశధార భగీరధపురం, రెల్లివలస, పిండ్రువాడలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

● ఎల్‌ఎన్‌పేట మండలంలోని స్కాట్‌పేట, దబ్బపాడులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

ఇచ్ఛాపురంలో..

● ఇచ్ఛాపురం మండలంలోని బాహుద నదిలో బిర్లంగి, మశాఖపురం, రత్తకన్న, ఈదుపురం, డొంకూరు గ్రామాల్లోని ఇటుక బట్టీల వెనక జేసీబీలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు.

నరసన్నపేటలో..

● నరసన్నపేట మండలంలోని వంశధార నదిలో మడపాం, గోపాలపెంట, చేనువలస, బుచ్చిపేట, వెంకటాపురం గ్రామాల్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

● జలుమూరు మండలంలోని వంశధార నదిలో పర్లాం, అందవరం, కొమ్మనాపల్లి, దొంపాకలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

అడ్డొస్తే దాడులు.. బెదిరింపులు

జిల్లాలో టీడీపీ ఇసుక మూకలు బరితెగించి దాష్టీకానికి దిగుతున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలోనైతే అక్రమ తవ్వ కాలను అడ్డుకుంటే చంపేస్తామని బెదిరింపులకు సైతం దిగుతున్నారు.

నకిలీ బిల్లులతో రవాణా చేస్తున్న ఇసుక లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా లంచావతారం ఎత్తిన ఓ అధికారి జిల్లా సరిహద్దులను దాటించేసిన వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

బూర్జ మండలం ఈ కాఖండ్యాం ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలపై మైన్స్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులందరికీ ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా అడ్డుకుంటున్నారని సురేష్‌ అనే వ్యక్తిపై ఇసుక మాఫియాకు చెందిన టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

ట్రాక్టర్లకు ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించడంతో కొన్ని ట్రాక్టర్ల ఇసుక కోసం వంశధార నది లోని గార డీసిల్టేషన్‌ పాయింట్‌లోకి వెళ్తే నేరుగా సంబంధిత నిర్వాహకులు అ డ్డుకుని భయబ్రాంతులకు గురి చేశారు.

ప్రధాన పత్రిక విలేకర్ల బృందం నరసన్నపేట మండలం గోపాలపెంట ఇసుక ర్యాంపులోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేందుకు యత్నించగా అక్కడి ఇసుక మాఫియా దాడికి యత్నించింది.

పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో అనధికారికంగా నడుపుతున్న ర్యాంపును పరిశీలించడానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అండ్‌ పార్టీ శ్రేణులను టీడీపీ ఇసుక మూకలు అడ్డుకుని దాడికి ప్రయత్నించాయి.

వంశధార, నాగావళి, బాహుదాలో అడ్డగోలుగా తవ్వకాలు

అక్రమంగా ఇతర జిల్లాలకు రవాణా

అడ్డొచ్చిన వారిపై దాడులు, బెదిరింపులు

టీడీపీ నేతలకు కోట్లు కురిపిస్తున్న ఇసుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement