టెక్కలి : ఏఐసీటీఈ అటల్ అకాడమీ ఆధ్వర్యంలో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్ 14 నుంచి 19 వరకు జాతీయ స్థాయిలో జరగనున్న అధ్యాపకుల ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అధ్యాపకులకుటెక్నాలజీ, పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్ యు.డి.ప్రసన్న, టి.రవికుమార్, డీన్లు తదితరులు పాల్గొన్నారు.


