శ్రీకాకుళం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఏపీఎస్ ఆర్టీసీ 260 బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు ఈ బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం 1, 2 డి పోలు, టెక్కలి, పలాస తదితర 4 డిపోల నుంచి మొత్తం 260 బస్సులు ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 4, 5వ తేదీలలో జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రధాన మార్గాల్లో అనగా శ్రీకాకుళం–విశాఖపట్నం, శ్రీకాకుళం–పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం–పాలకొండ, శ్రీకాకుళం–కొత్తూరు–బత్తిలి, శ్రీకాకుళం–శ్రీముఖలింగం, శ్రీకాకుళం–పాతపట్నం, శ్రీకాకుళం–రాజాం–బొబ్బిలి, శ్రీకాకుళం–చీపురుపల్లి, శ్రీకాకుళం–విశాఖపట్నం మార్గాలలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు స ర్వీసులు పూర్తిగా రద్దు చేశామని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు, అన్ని ప్రధాన మార్గాలలో అతి తక్కువ సర్వీసులు పాక్షికంగా నడుస్తాయని, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్యా య ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పరిషత్ పోలింగ్‌కు స్థానిక సెలవులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 5వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్, ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, విద్యాసంస్థలకు పోలింగ్ ముందు రోజైన నవంబర్ 4, పోలింగ్ రోజైన నవంబర్ 5వ తేదీల్లో (రెండు రోజులు) స్థానిక సెలవు ప్రకటించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, బూత్‌ల ఏర్పాటుకు అనువుగా ఈ ని ర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగే పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు నవంబర్ 5వ తేదీన స్థానిక సెలవు అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో పనిచే సే ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు వీలుగా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.
‘ఓటు కోసం మాట మార్చొద్దు’
సరుబుజ్జిలి: స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ స్థానిక ఎన్నికల్లో గిరిజనుల ఓట్లు దండుకొనేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యో గి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే వెన్నెలవలస, బక్కిరిపేట గిరిజన గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం ఎ లాంటి థర్మల్ ప్లాంట్ మంజూరు చేయలేదని గిరిజన నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్ప డం మోసగించడమేనని అన్నారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లోని 20 గ్రామాల్లో 5వేల ఎకరాల బీడుభూముల్లో థర్మల్‌ప్లాంట్ నిర్మించతలపెట్టారని, ఇప్పుడు ఓట్ల కోసం మాట మారుస్తున్నారని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్ విమర్శించా రు. 300 ఎకరాల భూములు కలిగిన తాము, తమ భూములు ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తే తాము భూములు ఆక్రమించామని చెప్పడం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని అన్నారు. కూనవారి పూలతోట పేరుతో అప్పట్లో విప్‌గా ఉన్న ఎమ్మెల్యే 99 ఎకరాల ప్రభుత్వభూమిని లీజు పేరుతో కొట్టేయా ల ని చూడడం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. సమావేశంలో థర్మల్ పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం, పోరాట కమిటీ కన్వీనర్ సురేష్‌దొర, సవర ధర్మారావు, చల్ల యర్రయ్య, సవర కువ్వారి పాల్గొన్నారు.
ప్రచార ర్యాలీలు వద్దు: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఎలాంటి ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా నియమావళి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 6309990933, జిల్లా పోలీసుల ఎన్నికల సెల్ 6309990923, శ్రీకాకుళం డీఎస్పీ 6309990804, కాశీబుగ్గ డీఎస్పీ 6309990805, టెక్కలి డీఎస్పీ 6309990811 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.


