శ్రీకాకుళం పాతబస్టాండ్: మూడు దశాబ్దాలుగా వైద్యారోగ్య శాఖ నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న వారికి అదనపు హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేయాలని నర్సింగ్ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఖజానా శాఖ డీడీ రవికుమార్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. లిమిటేషన్ కారణంగా ప్రస్తుతం రూ.2 వేలు మాత్రమే అందుకుంటున్నామని చెప్పారు. ఈ విషయమై అక్టోబర్ 3న విడుదలైన సర్క్యులర్ మేరకు అదనపు హెచ్‌ఆర్‌ఏను ఎరియర్స్‌తో సహా విడుదల చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో సిబ్బంది కె.రోజారాణి, ఎం.భాని, పార్వతి, వెంకటమ్మ, చిన్నమ్మడు, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


