సారవకోట : రామకృష్ణాపురం పంచాయతీలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. అంబటి అప్పలస్వామి, అంబటి తిరుపతిరావు, ముడిదాన సింహాచలం, ముడిదాన పృథ్వీరాజ్, అరియాపల్లి రామారావు, పిల్లల చిన్నారావు, అంబటి చిన్నబాబు, శిమ్మ ఉత్తరరావు, పల్లి భవానిరాజు, రుంకు కృష్ణ, పీసా బాలకృష్ణ, బమ్మిడి రాజారావు, ఆవల తవిటయ్య, ఆవల సింహాచలం తదితరులు మాజీ సర్పంచ్ సాధు సతీష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బలపర్చాలని కోరారు.


