వజ్రపుకొత్తూరు:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఇ.వి.నరేష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పీహెచ్‌సీని సందర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్య సేవలు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం కల్పించి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా చొరవ తీసుకోవాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉన్నందున వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ వినయ్‌కుమార్, ఈఓ సన్యాసిరావు, ఫార్మసిస్ట్ సుబ్రహ్మణ్యం, స్టాఫ్‌నర్సులు, ఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


