కౌంటింగ్‌కు మూడంచెల భద్రత | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు మూడంచెల భద్రత

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల పరిధిలో కట్టుదిట్టమైన పోలీసుల భద్రత నడుమ ఆదివారం పోలింగ్‌ ప్రక్రియ ముగిసిందని, ఈ నెల 3న నిర్వహించనున్న కౌంటింగ్‌ (ఓట్ల లెక్కింపు) ప్రక్రియకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో రెవెన్యూ, పోలీస్‌, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలింగ్‌ నిర్వహించామన్నారు.

మూడంచెల భద్రత..

ఇచ్ఛాపురం, పలాసలోని నిర్దేశిత కౌంటింగ్‌ కేంద్రా లకు ఎన్నికల సామగ్రిని పటిష్ట భద్రత నడుమ తరలించి భద్రపరుస్తామన్నారు. లెక్కింపు ప్రక్రియను మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి పోలీస్‌ యాక్ట్‌ 30, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌163 (144 సెక్షన్‌) అమల్లో పెడతామన్నారు. ర్యాలీలకు అనుమతి లేద ని, ఎన్నికల నియమావళి, పోలీసు ఆంక్షలు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. అంతకుముందు పలాస ఉదయపురం, సూదికొండ, ఇంద్రచౌక్‌, చినబడాం, ఇచ్ఛాపురం రత్తకన్న, బెల్లుపాడు, పురుషోత్తపురం వంటి సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి డ్రోన్‌ విజువల్స్‌తో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. శనివారం రాత్రి లాడ్జీలను పోలీసులు తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement