ఎచ్చెర్ల : కుప్పిలి కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుప్పిలి గ్రామానికి చెందిన దుంప షణ్ముఖరావు (20) తన బంధువుల ఫారంలో శనివారం రాత్రి ఫెన్సింగ్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కుప్పేసు, సుబ్బమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


