కంచిలి: జిల్లాలో తీర ప్రాంత రైతులను తుఫాన్ల ముప్పు నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించాలని మహాత్మా జ్యోతిరావు ఫూలే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీన ఢిల్లీరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రం కంచిలిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుఫాన్లలో నష్టపోయిన రైతులకు కేవలం పరిహారం ఇవ్వడంతో సరిపెట్టవద్దని, శాశ్వత రక్షణ కల్పించాలని కోరారు. జిల్లాలో తీర ప్రాంతాలను ప్రత్యేక జోన్ కింద ప్రకటించి రైతులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. తుఫాన్లను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చని, కానీ శాసీ్త్రయ ప్రణాళిక, సహజ పర్యావరణ వ్యవస్థల రక్షణ, వ్యవసాయంలో మార్పులు, ముందస్తు హెచ్చరికలు, రైతులకు ఆర్ధిక భద్రత కల్పించడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కామేశ్వరరావు, సభ్యులు ఎర్ర గిరిబాబు, రైతు నాయకులు గార కృష్ణారావు, మధుబాబు పాల్గొన్నారు.


