శ్రీకాకుళం న్యూకాలనీ: నగరానికి చెందిన యువ బాక్సింగ్ క్రీడాకారిణి టీవీ నైషా జాతీయస్థాయిలో మరోసారి తన పంచ్ చూపించింది. హర్యానా వేదికగా జరిగిన సీబీఎస్సీ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో అండర్–14 విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. దేశంలోని అన్ని జోన్ల నుంచి వచ్చిన 16 మంది అత్యుత్తమ బాక్సర్లు పోటీపడగా, ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తుచేసి విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది. తండ్రి టీవీ కార్తీక్, తల్లి స్వాతి. శ్రీకాకుళంలోని కేంద్రీయ విద్యాలయంలో పూర్తిచేసి ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న నైషాను గజపతి మాస్టార్, రాజేష్, భాషా, జయమూర్తి తదితరులు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు.


