ఇంకా ముంపులోనే పంటపొలాలు | - | Sakshi
Sakshi News home page

ఇంకా ముంపులోనే పంటపొలాలు

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

ఆమదాలవలస రూరల్‌: అన్నదాతను అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఇంకా వెంటాడుతునే ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు సాగునీటి కాలువలు పొంగి ప్రవహించటమే కాకుండా పంట పొలాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. నాగావళి నది నీటి తీవ్రత పెరగటంతో నారాయణపురం ఆయకట్టు ఎడమ కాలువ పరిధిలో పలు కాలువలు పొంగి ప్రవహించటంతో పంటపొలాలు జలమయమయ్యాయి. ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం లేకపోవడంతో పంట చేజారినట్టేనని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

ఆదిత్యుని సన్నిధిలో గోవింద రామానుజ జీయర్‌ స్వామీజీ

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి క్షేత్ర గోవింద రామానుజ జీయర్‌ స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు సూపరింటెండెంట్‌ వెంకటరమణ గౌరవ సాంప్రదాయ స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement