వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఇచ్ఛాపురం ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఇచ్ఛాపురం ఓటర్లు

Nov 2 2026 2:05 AM | Updated on Nov 2 2026 2:05 AM

● పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

కంచిలి: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఓటర్లు వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నారని పోలింగ్‌ సరళిని బట్టి అర్థమవుతోందని పార్టీ జిల్లా అధ్య క్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆదివారం జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్‌ జరిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తోపాటు 27 వార్డుల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంటామని కృష్ణదాస్‌ ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని పుర ప్రజలు గమనించారని, ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు పట్టం కట్టబోతున్నారనేది పోలింగ్‌ సరళిలో స్పష్టమైందని జిల్లా పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నిక ద్వారా కూటమి పార్టీలకు బుద్ధి చెబుతున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు పిరియా సాయిరాజ్‌, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్‌, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాభాల స్వర్ణమణి, సీనియర్‌ నేత చాట్ల తులసీదాస్‌, వి.అరుణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement