చేతిలో అస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

చేతిలో అస్త్రాలు

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

● జిల్లాలో కీలక ప్రాజెక్టులు నిర్మించిన వైఎస్సార్‌సీపీ

● వైఎస్సార్‌ హయాంలోనూ పరుగులు పెట్టిన అభివృద్ధి పనులు

● ఎన్నికల ప్రచారంలో వాటినే ప్రస్తావిస్తున్న నాయకులు

● శ్రీకాకుళంలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడ అంటూ సూటిగా నిలదీత

ఉద్దానం ఆశారేఖ

కిడ్నీ వ్యాధికి బలైపోతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అండగా నిలిచిన ప్రాజెక్టు ఇది. పలాసలో రూ. 80కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్‌ సెంటర్‌, అతిపెద్ద డయాలసిస్‌ సెంటర్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఉద్దానం పాలిట ఆశారేఖగా మారింది. వైఎస్‌ జగన్‌ పాలనకు ఓ మచ్చుతునకగా ఠీవిగా కనిపిస్తోంది.

ఈ నీరే సాక్షి..

ఉద్దానం కిడ్నీ వ్యాధులకు తాగునీరు కారణమనే వాదన ఉంది. అందుకే ఉద్దానానికి హిరమండలంలోని వంశధార నుంచి ఉపరితల నీటిని 807 గ్రామాలకు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు చేపట్టి, ప్రారంభోత్సవం చేసి, ప్రజలకు నీరు అందించారు. సిక్కోలుపై వైఎస్‌ జగన్‌ చూపించిన ప్రేమకు ఈ నీరే సాక్ష్యం.

లిఫ్ట్‌ ఘనత ఎవరిది.?

జిల్లాకు కీలకమైన వంశధార ఫేజ్‌–2లోని స్టేజ్‌–2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి కట్టేంత వరకు ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా చేపట్టారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ. 26.65కోట్లు మంజూరు చేశారు.

పోర్టు.. దశాబ్దాల కల

సిక్కోలు దశాబ్దాలుగా కంటున్న కల మూలపేట పోర్టు. వైఎస్‌ జగన్‌ పాలనా కాలంలో రెండేళ్లు కరోనాతో ప్రపంచం ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా మూలపేట పోర్టును పట్టాలెక్కించి భూ సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించి దాదాపు ఓ రూపురేఖకు తెచ్చారు. ల్యాండ్‌ లార్డ్‌ మోడల్‌ విధానంలో రూ. 2,949.70కోట్లతో పను లు సాగించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. సిక్కోలు కల నెరవేర్చడానికి వైఎస్‌ జగన్‌ ఏం చేశారో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

జగన్‌ చేపడితే...కూటమి ఆపేసింది

మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు నిలిపేసి, గాలికొదిలేసింది. మత్స్యకారుల కల నెరవేరకుండా చేశారు.

కీలక విద్యా సంస్థలు

సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల మంజూరు చేశారు. దానికి సంబంధించిన తాత్కాలిక క్లాసులు దన్నాన పేట ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో నిర్వహించారు. ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల ఏర్పా టు మంజూరు చేశారు. తరగతులు కూడా ప్రారంభించారు. బూర్జ మండలం పెద్దపేటలో హార్టిక ల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement