● జిల్లాకు జీవదాత అయిన రిమ్స్‌ను వైఎస్సార్ మంజూరు చేశారు. మంజూరు ప్రకటన చే యడమే కాకుండా రూ. 119కోట్లు కేటాయించారు. 300పడకల జిల్లా కేంద్ర ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. శంకుస్థాన, ప్రారంభోత్సవం రెండూ ఆయన చేతులు మీదుగానే జరిగాయి.
● వంశధార, నాగావళి నీటిని రైతుల చెంతకు చేర్చేందుకు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. 2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు. జిల్లాలోని హిర మండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు.
● తోటపల్లి ఫేజ్–2 పనుల ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 123.25కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టును రూపక ల్పన చేశారు. వంశధార, నాగావళి నదుల అ నుసంధానం పనులు పూర్తయితే 2.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్ అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు.
● 12500ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్–1పనులను రూ. 57.87కోట్ల తో చేపట్టారు. నదుల వరద ఉద్ధృతి నుంచి రక్షించేందుకు రూ. 300 కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు.
● ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీని 2008 జూలై 25న ఏర్పాటు చేశారు.


