న్యూస్‌రీల్
చేసిన పనులే
సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
దాదాపు మూడువేల కోట్ల మూలపేట పోర్టు.. దాదాపు ఎనిమిది వందల కోట్ల సురక్షిత మంచినీటి పథకం.. వంద కోట్ల కిడ్నీ ఆస్పత్రి.. గొట్టా లిఫ్ట్ ఇరిగేషన్.. ఫిషింగ్ హార్బర్‌కు శ్రీకారం.. వెటర్నరీ, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ వంటి కీలక విద్యాసంస్థలు.. కేవలం ఐదేళ్ల పాలనా కాలంలో వైఎస్సార్‌సీపీ సాధించిన ప్రాజెక్టులు. అందులో రెండేళ్లు కరోనాకే చెల్లిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పనులు కూడా కలుపుకుంటే దాదాపు జిల్లాలోని ప్రతి కీలక ప్రాజెక్టు వైఎస్సార్, వైఎస్ జగన్ రూపకల్పన చేసినవే. వైఎస్సార్ పాలనా కాలం కూడా దాదాపు ఆరేళ్లే. మరి పదిహేనేళ్లకుపైగా అధికారంలో ఉన్న టీడీపీ జిల్లాకు చేసిందేమిటని ప్రతిపక్ష నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దీన్నే ఆయుధంగా వాడుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం


