● ధర్మానపై కూన ఎగతాళి వ్యాఖ్యలు
● హుందాతనం వీడి అనుచిత ప్రవర్తన
● అధిష్టానం మెప్పు కోసం వీరావేశం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆమదాలవలస ఎమ్మె ల్యే కూన రవికుమార్ తన వ్యవహార శైలి మార్చుకోలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మాటలో హుందాతనం కనిపించడం లేదు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, నాలు గు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావును పట్టుకుని ‘చేతులు, కాలు, పొట్ట, గిట్ట ఊపుతూ ఏదేదో మాట్లాడుతున్నార’ంటూ హేళన చేస్తూ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి వి మర్శలు సహజం. కానీ బాడీ షేమింగ్ చేస్తూ అనుచితంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దె బ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మెప్పు కోసం తిప్పలు..
అధిష్టానం మెప్పు కోసం కూన ఎప్పటి నుంచో తిప్పలు పడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతి సారీ ‘పాతి పెడతాం, తరిమికొడతాం, సమాధి చేసేస్తాం, సముద్రంలో కలిపేస్తాం...వెంట తగులుతాం..’ అంటూ వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే రాయలేని భాషలో విరుచుకుపడేవారు. ఇప్పటికీ ఆ వీడియోలు, వాయిస్ రికార్డులు యూట్యూబ్‌ల్లోనూ, సోషల్ మీడియాలో ఉన్నాయి. చివరకు సొంత కార్యకర్తలతోనూ, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులతోనూ అదే రీతిన ప్రవర్తించారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సౌమ్యతో వ్యవహరించిన తీరు జిల్లా అంతా చూసింది.
కూన వారి ఆణిముత్యాలివిగో..
● పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో కోవిడ్ నిబంధనల మేరకు కొందరే రావాలని పోలీసు అధికారులు అన్నందుకు ‘జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త. మీ స్థాయి ఎంత ..మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు.
● పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే ‘నేను ఖాళీ చేయ ను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫరవాలే దు, నువ్వే గానీ అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని బెదిరించారు.
● పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను’ అంటూ బెదరించారు.
● పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను భయపెట్టారు.
● ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపై ‘నీకెంత ఒల్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా..’ అంటూ రెచ్చిపోయారు.
● మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను..’ అంటూ శివాలెత్తారు.
● ‘నీ కాళ్లు ఇరగకొట్టక పోతే చూద్దువుగాని.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటాదో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ శ్రీకాకుళం టూటౌన్ పోలీసులపై జులుం చూపించారు.


