● రగిలిన అసమ్మతి సెగ | - | Sakshi
Sakshi News home page

● రగిలిన అసమ్మతి సెగ

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

సా్థనిక సంస్థల ఎన్నికల్లో మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగ వేడెక్కుతోంది. సీట్లు కేటాయింపు విషయంలో మంత్రి వైఖరిని పూర్తిగా తప్పుబడుతూ కొంత మంది సీనియర్‌ నాయకులు తిరుగుబావుటా ఎగురవేస్తున్నా రు. నందిగాం మండలంలో టీడీపీ నుంచి జెడ్పీటీసీతో పాటు పలు ప్రాదేశికాల్లో సీట్ల కేటాయింపు పై దివంగత మాజీ ఎమ్మెల్యే అట్టాడ జనార్ధన్‌ నా యుడు తనయుడు సీనియర్‌ నాయకుడు రవిప్రసాద్‌ తోటి కార్యకర్తలతో ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేసిన ఆడియోక్లిప్‌ వైరలవుతోంది. నందిగాం మండలం జెడ్పీటీసీ స్థానాన్ని పోలాకి చంద్రశేఖర్‌కు కేటాయించారు. ఈయన ప్రస్తుతం టెక్కలిలో నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా ప్రస్తు తం లట్టిగాం పీఏసీఎస్‌ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మళ్లీ ఆయనకే టికెట్‌ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంపీటీసీ, ఎంపీపీ సీట్ల విషయమై కూడా అసమ్మతి సెగలు రగులుతున్నాయి. నందిగాం మండలంలోని కళింగ సామాజిక వర్గంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ముద్ర పడిన ఓ వర్గానికి మంత్రి పూర్తిగా అన్యాయం చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరో వైపు యాదవ సామాజిక వర్గం నుంచి సీనియర్‌ నాయకునిగా ఉన్న జానకిరావు లాంటి కార్యకర్తలను సైతం విస్మరించారనే చర్చ అధికార పార్టీలో నడుస్తోంది.

– సాక్షి టాస్క్‌ఫోర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement