శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

నీ లెక్క అధిష్టానం వద్ద..ఎచ్చెర్ల టీడీపీలో ముసలం పుట్టింది. ఎంపీ కలిశెట్టి వైఖరిపై చౌదరి బాబ్జీ విరుచుకుపడ్డారు. –IIలో

న్యూస్‌రీల్‌

నీ లెక్క అధిష్టానం వద్ద..ఎచ్చెర్ల టీడీపీలో ముసలం పుట్టింది. ఎంపీ కలిశెట్టి వైఖరిపై చౌదరి బాబ్జీ విరుచుకుపడ్డారు. –IIలో
ఆశ పెడదాం.. ఆనక చూసుకుందాం

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

పదవి ఆశ చూపి..

మరోవైపు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానం టీడీపీకే ఉంటుందని, ఆ స్థానం అటు కాళింగ సామాజిక వర్గానికి, ఇటు కాపు సామాజిక వర్గానికి తాయిలంలా చూపిస్తూ వస్తోంది. రెండు మూడు పేర్లు తెరపైకి వచ్చి, వారిని ఊరిస్తూ ఎన్నికలకు వెళ్తోంది. దీంతో టీడీపీలోని కాపులు, కాళింగ సామాజిక వర్గీయులు ఆ పదవి తమకే వస్తుందని ఎవరి ధీమాలో వారున్నారు. కానీ అధిష్టానం మరో ఎత్తుగడతో ముందుకెళ్తోంది. జిల్లా పరిషత్‌కు సంబంధించి అత్యధిక స్థానాలు గెలిస్తే అప్పుడు చూసుకోవచ్చనే ఆలోచనతో ఊహాగానాలు ప్రచారంలో ఉండేలా చూసుకుంటోంది. అవే నిజమనుకుని ఆయా సామాజిక వర్గాలను భ్రమల్లో పెడుతోంది.

జెడ్పీ

మేయర్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

‘పైకి చెప్పేదొకటి.. లోపల అనుసరించేది మరొకటి’ స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ కొత్తగా అనుసరిస్తున్న సూత్రమిది. శ్రీకాకుళం మేయర్‌ జనసేనకు, జెడ్పీ చైర్‌పర్సన్‌ టీడీపీకి అని మొదట ప్రకటించినా.. అంతర్గతంగా కొత్త ఆట మొదలుపెట్టింది. ఈ ఆటలో కొన్ని సామాజిక వర్గాలు, ఆ వర్గానికి చెందిన నాయకులు బలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓటమి భయంతో..

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినా స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం టీడీపీలో సుస్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరిక ఖరారైన తర్వాత ఓడిపోయే మేయర్‌ స్థానం ఉంచుకోవడం కంటే జనసేనకు ఇచ్చేయడం మంచిదనే ఉద్దేశంతో శ్రీకాకుళం మేయర్‌ స్థానాన్ని కేటాయించారు. జనసేన కూడా తమకు వచ్చిందే మహా ప్రసాదమని స్వీకరించింది. అయితే పొత్తుల ప్రకటన వెలువడగానే టీడీపీ నుంచి మేయర్‌ స్థానం ఆశించిన పైడిశైట్టి జయంతికి చెందిన కళింగ వైశ్య సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. జిల్లాలో మున్సిపాలిటీల్లో గానీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల్లో గాని ఎక్కడా కళింగ వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వ్యూహాత్మకంగా టీడీపీ తమను తొక్కుతోందనే అభిప్రాయం ఆ సామాజిక వర్గంలోకి వెళ్లిపోయింది. దీంతో కళింగ వైశ్య సామాజిక వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు.

ముందు ఎన్నికలు జరగనీ..

బుగ్గ గిల్లి జోల పాట పడినట్టు లోపాయికారీగా జనసేన అధిష్టానంతో మరో రకమైన సంప్రదింపులు చేస్తున్నట్టుగా లీకులిస్తోంది. కళింగ వైశ్యుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరో కొత్త ఎత్తుగడ వేసింది. మేయర్‌ స్థానాన్ని టీడీపీ తీసుకోవడానికి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేనకు ఇచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నట్టుగా ప్రచారం లేవనెత్తింది. దీని వల్ల ముందు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో అటు కాపులు, ఇటు కాళింగులు, మరో వైపు కళింగ వైశ్యుల నుంచి సానుకూలతో లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ ఎన్నికలైపోయాక శ్రీకాకుళం మేయర్‌ సంగతి చూసుకోవచ్చని ఆలోచన చేస్తోంది. మూడు ప్రధాన సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా, డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసుకోవడానికి ఎన్నికల పూర్తయ్యే వరకు ‘ఆశల పల్లకి’ చూపించేలా సరికొత్త డ్రామా ఆడుతోంది. అందులో భాగంగానే ఎల్‌ఎన్‌పేట జెడ్పీ స్థానం నుంచి కొరికాన భవానీ చేత యుద్ధ ప్రాతిపదికన నామినేషన్‌ వేయించగా, అదే పంథాలో నరసన్నపేట, ఇచ్ఛాపురం, పలాస, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల నుంచి కూడా జనసేన నాయకుల చేత జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేలా చూశారు. జెడ్పీ ఎన్నికలైపోయాక శ్రీకాకుళం మేయర్‌ సంగతి చూసుకోవచ్చనే ధోరణిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఎవరికివ్వాల్సిన హామీలు వారికిచ్చి ఎన్నికల్లో పనిచేయించుకోవాలని చూస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఏ వర్గాలైతే ప్రధాన పదవులు ఆశిస్తున్నాయో ఆ ప్రక్రియ అయిపోయే వరకు అవే ఆశలతో ఆ వర్గాలను వాడుకోవాలనుకుంటోంది. ఇప్పుడిదే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముందు జెడ్పీ ఎన్నికల్లో లబ్ధిపొందాక, మేయర్‌ ఎన్నికల్లో తదుపరి ప్లాన్‌ అమలు చేయాలని వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇది తెలియక అటు జనసైనికులు, బీజేపీ శ్రేణులు, ఇటు టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఎవరికి వారే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ డబుల్‌ గేమ్‌లో ఎన్నికలు ముగిశాక అసలు సినిమా కనబడనుంది.

జెడ్పీటీసీలకు 245.. ఎంపీటీసీలకు 2949

స్థానిక ఎన్నికల్లో టీడీపీ డబుల్‌ గేమ్‌

జెడ్పీ చైర్‌పర్సన్‌, మేయర్‌ స్థానాల కేటాయింపు అటు ఇటు కావచ్చని

సంకేతాలు

ఎన్నికల్లో అసంతృప్తి తలెత్తకుండా కాళింగ, కళింగ వైశ్య, కాపులను

మభ్యపెడుతున్న వైనం

జెడ్పీ రేసులో తెరపైకి జనసేన నాయకురాలు కొరికాన భవానీ

యుద్ధ ప్రాతిపదికన నామినేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement