రణస్థలం: మండలంలోని కూటమి పార్టీలో కుమ్ములాటలు తప్పడం లేదు. రెబల్‌గా పోటీ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఇటీవల కూటమి పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశా రు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నా యి. కూటమిలోని పోటీదారులంతా ఎవరి స్వలా భం కోసం వారే నామినేషన్లు ధాఖలు చేశారు. రణస్థలం మండల కేంద్రానికి చెందిన సైకిల్ పార్టీ ముఖ్య నాయకులు రాత్రి నీకే టికెట్ అంటూనే.. పొద్దున్న మరొకరితో నామినేషన్ వేయించేస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఆర్థికంగా ఖర్చు పెట్టి, ప్రజా బలం సంపాదించి ఇదేంటి ఈ ఖర్మ మాకు అంటూ నలిగిపోతున్నారు. దేరసాం, జేఆర్ పురం, కొవ్వా డ, రణస్థలం–1, నారువ, జి. సిగడాం, ఎందువ, బాతువ, జాడ, నిద్దాం, గెడ్డకంచరాం, గోవిందపురం, పాతకుంకాం, ఎచ్చెర్ల, ఎస్.ఎం. పురం కేశవరాయునిపేట, చిలకపాలెం, అల్లినగరం ఎంపీటీసీల స్థానాలు, రణస్థలం, ఎచ్చెర్ల జెడ్పీటీసీల స్థానాల్లో స్పష్టత లేక టీడీపీ, జనసేన పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఇందులో అభ్యర్థి ఎవరో, రెబల్ ఎవరో, విత్ డ్రా ఎవరికి చేయమంటారో.. బి–ఫారం ఎవరికి ఇస్తారో తెలియాలంటే 27 వరకు ఆగాల్సిందే.


