నరసన్నపేట: నరసన్నపేట జెడ్పీటీసీ స్థానానికి కూటమి పార్టీలోని మూడు పార్టీలు సిగపట్లు పడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తమకే బీ ఫారం వస్తుందని ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారానికి తగ్గట్టుగా టీడీపీ ఎటూ తేల్చడం లేదు. దీంతో మూడు పార్టీల నుంచి ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే నరసన్నపేట జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున బలగ భారతి, జనసేన నుంచి బలగ ప్ర వీణ్, బీజేపీ నుంచి చింతు పాపారావు, పంచిరెడ్డి జగన్ నామినేషన్ వేశారు. ఈ దశలో ఎవరికి వారు ఈ సీటు మాదే.. మా పార్టీకే వస్తుందని ప్రచారం చేస్తున్నారు.


