రాజుకున్న రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రాజుకున్న రాజకీయం

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

ఇంత నిర్లక్ష్యమా..?ఆదిత్యుని సన్నిధిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పుష్కరిణి వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. –IIలో

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
ఇంత నిర్లక్ష్యమా..?ఆదిత్యుని సన్నిధిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పుష్కరిణి వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. –IIలో

శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లా రాజకీయాల్లో గురువారం భారీ రాజకీయ మార్పు చోటు చేసుకుంది. ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకునే టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ పార్టీకి రాజీనామా చేసి, తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకుంటూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అధికార కూటమికి పెద్ద షాక్‌గా మారగా, జిల్లా రాజకీయ సమీకరణాలను మార్చేసే పరిణామంగా నిలిచింది.

రాజకీయ పునరేకీకరణ

జిల్లా రాజకీయ యవనికపై అతి పెద్ద పునరేకీకరణ జరిగింది. 40 ఏళ్ల పాటు సిక్కోలు నియోజకవర్గంలో టీడీపీని కంటికి రెప్పలా కాపాడిన గుండ కుటుంబం ఆ పార్టీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిణామం శ్రీకాకుళం టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. నాలుగు దశాబ్దాలుగా జిల్లాలో బలమైన క్యాడర్‌ ఉన్న గుండ కుటుంబం ఆ పార్టీని వీడటం రాబోయే ఎన్నికల్లో కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన స్థానిక టీడీపీ నేతల్లో మొదలైంది. బుధవారం కన్నీటి పర్యంతమవుతూ టీడీపీకి గుడ్‌ బై చెప్పిన గుండ లక్ష్మీదేవి, గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. లక్ష్మీదేవి చేరికతో వైఎస్సార్‌ సీపీలో మరింత జోష్‌ పెరిగింది.

అధికార పార్టీకి మైండ్‌ బ్లాంక్‌

అధికార గర్వంతో సొంత సీనియర్‌ నాయకులను, నిబద్ధత గల కుటుంబాలను పక్కన పెడితే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురవుతాయో శ్రీకాకుళం రాజకీయం నిరూపించింది. గుండ లక్ష్మీదేవి రూపంలో సిక్కోలు పచ్చకోటకు పడిన ఈ గండిని పూడ్చడం ప్రస్తుత స్థానిక నాయకత్వానికి అంతు సులువు కాదు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా కై వసం చేసుకోవాలని భావించిన టీడీపీకి ఈ పరిణామం మైండ్‌ బ్లాంక్‌ చేసింది. ఈ పొలిటికల్‌ షాక్‌ నుంచి టీడీపీ తేరుకోవడం కష్టమే.ఆమెకున్న వ్యక్తిగత ఇమేజ్‌, నగర ప్రజల్లో ఉన్న సాన్నిహిత్యం భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపనుంది.

ధర్మాన వ్యూహం

శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన వర్సెస్‌ గుండ కుటుంబాల మధ్య హోరాహోరీ పోరు సాగేది. ఈ రెండు వర్గాల బలమే ఎన్నికల ఫలితాలను శాసించేది. అలాంటిది, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా వ్యూహం పన్ని గుండ లక్ష్మీదేవిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావడం ద్వారా వేసిన మాస్టర్‌ స్ట్రోక్‌తో టీడీపీకి కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అధికారంతో విర్రవీగి, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పాలనకు చరమ గీతం పాడాలన్న ఆలోచనతో ధర్మాన వేసిన అడుగులు సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపాయి. శ్రీకాకుళం ఏలిన నాయకులు ఎంతో మంది చరిత్రలో నిలిచిపోయారని, ఇప్పుడా పరిస్థితి లేదని, పదవులకే మచ్చ తెచ్చి పెట్టేలా వ్యవహరిస్తూ రాజకీయాలను దిగజార్చారన్న ఆవేదనతో ధర్మాన ప్రసాదరావు తీసుకున్న నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విలువలకు దక్కని గౌరవం

విలువలకు మారుపేరుగా నిలిచిన గుండ లక్ష్మీదేవి తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన అనంతరం చేసిన వ్యాఖ్యలు టీడీపీ పునాదులను కదిలించేలా ఉన్నాయి.

‘పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన మా కుటుంబానికి దక్కిన బహుమతి అవమానాలే. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నా భర్త విగ్రహాన్ని పెట్టనివ్వకుండా సొంత పార్టీ నేత లే దిమ్మెలు కూల్చేస్తుంటే చంద్రబాబునాయుడు చూస్తూ ఊరుకున్నారు’

అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క మాటతో టీడీపీలో పాత కాపులకు, కష్టపడే వారికి విలువ లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే బలంగా నాటుకుపోయింది. ఇది ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది.

వైఎస్సార్‌సీపీలోకి చేరిన గుండ లక్ష్మీదేవి

టీడీపీలో రేగిన గుబులు

ఆందోళనలో టీడీపీ నాయకత్వం

స్థానిక ఎన్నికల వేళ అధికార పార్టీకి

పెద్ద షాక్‌

లక్ష్మీదేవికి జరిగిన అవమానాలపై

జిల్లా వ్యాప్తంగా చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement