● పేట.. కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

● పేట.. కుమ్ములాట

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

నరసన్నపేటలో కూటమిలో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు స్థానిక ఎన్నికల సందర్భంగా రాజుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కూటమి భాగస్వామ్య పార్టీలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ, జనసేనలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఇవి మరింతగా పెరిగాయి. నరసన్నపేట జెడ్పీటీసీ స్థానానికి గురువారం బీజేపీ తరఫున నాలుగు నామినేషన్లు వేశారు. శుక్రవారం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బలగ ప్రవీణ్‌కు కూడా నామినేషన్‌ వేయనున్నారు. అలాగే కరగాం, మడపాం ఎంపీటీసీ స్థానాలకు జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరో ఆరు చోట్ల వేస్తామంటున్నారు. మరో పక్క పోలా కి జెడ్పీటీసీ స్థానానికి జనసేన తరఫున మెట్ట సుగుణ కుమారి నామినేషన్‌ వేశారు. దీంతో టీడీపీలో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. –నరసన్నపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement