సా్థనిక సంస్థల ఎన్నికలు సందర్భంగా నామినేషన్ కేంద్రానికి నామినేషన్ వేసిన అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులు వెళ్లాలన్నది నిబంధన. కానీ ఇచ్ఛా పురం మండలానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి రెండు రోజులుగా కార్యాలయంలోనే ఉండడంపై ప్రతిపక్ష అభ్యర్థులు అభ్యంతరం చెబుతున్నారు. అటు మీడియాను గానీ, ఇటు ఇతరులు గానీ వెళ్లకుండా ఆంక్షలు పెట్టే పోలీసులు సాక్షాత్తు టీడీపీ మండల అధ్యక్షుడు హోదాలో నామినేషన్ కేంద్రానికి ఎలా పంపిస్తారని, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది సైతం ఎలా అనుమతులు ఇస్తున్నారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. –ఇచ్ఛాపురం రూరల్


