చేతలు మావి.. మాటలు వారివి | - | Sakshi
Sakshi News home page

చేతలు మావి.. మాటలు వారివి

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

● కూటమి అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇదే సరైన సమయం

● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

ఇండస్ట్రీ కారిడార్‌ భూములను

కట్టబెట్టే కుట్ర

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పలాస ఇండస్ట్రీ కారిడార్‌ కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో 62 ఎకరాలను కేటాయించామని, అదే కారిడార్‌ను 28 ఎకరాలకు తగ్గిస్తూ మరో సారి టీడీ పీ నాయకులు శంకుస్థాపన చేయడమేంటని సీదిరి ప్రశ్నించారు. మిగతా 34 ఎకరాలను ఎందుకు కు దించారో ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి క్యాజూ ఇండస్ట్రీ కారిడార్‌ భూములను తమ సొంతవారికి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని సీదిరి సందేహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు భార్యా భర్తల గొడవల్లో చొరబడి వారి మధ్య చిచ్చుపెట్టార ని సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఓవైపు మద్యం పై అధిక ధరలు, మరోవైపు బెదిరింపులతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇలాంటి తరుణంలో పురపాలక ఎన్నికలు రావడంతో ప్రజల చేతికి వజ్రాయుధం లభించినట్టయ్యిందని, త్వరలోనే వీటన్నింటికీ చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని సీదిరి అన్నారు. అనంతరం గత ఐదేళ్లలో జంట పట్టణాల్లో జరిగిన అభివృద్ధిపై పోస్టర్‌ని విడుదల చేశా రు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శిష్టు గోపీ, బడగల బాలచందర్‌ (బల్లన్న), వి.శ్రీనివాసరావు తదితరులున్నారు.

కాశీబుగ్గ : ‘గత రెండున్నరేళ్లలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? బాగుపడింది సగటు పేదవాడా? ప్రజా ప్రతినిధులా ? అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కూటమి పాల నా కాలంలో జరుగుతున్న దాడులు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలను చూసి ఎందుకు వీరికి అధికారం ఇచ్చామా? అని పశ్చాత్తాప పడుతున్నారు’ అని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గ ప్రగతి భవన్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ పలాస మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి తాళాసు శ్రీపద్మకు మద్దతుగా మాజీ చైర్‌ పర్సన్‌ బళ్ల గిరిబాబు తదితరులతో కలిసి పాత్రికేయుల సమా వేశం నిర్వహించారు. 2019కు ముందు ఇక్కడికి పెద్ద సంస్థలు రావాలంటే ఇష్టపడేవాళ్లు కారని, ఇరుకైన రహదారులు, అపరిశుభ్ర వాతావరణం తదితర సమస్యలెన్నో పట్టిపీడించేవని గుర్తు చేశా రు. తాము అధికారంలోకి వచ్చాక కరోనా కాలాన్ని మినహాయిస్తే కేవలం రెండున్నరేళ్లలో కాశీబుగ్గ కేటీ రోడ్డు విస్తరణ, ముత్యాలమ్మ కోనేరు సుందరీకరణ, వీధుల విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు.

మా ఘనతను వాళ్ల ఖాతాలో వేసుకుంటున్నారు

కాశీబుగ్గ రైల్వే గేటుపై నుంచి ఆర్‌ఓబీ నిర్మాణంలో నిర్వాసితుల సమస్యలన్నీ అధిగమించామని, వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని దగ్గరుండి అందించా మని సీదిరి తెలిపారు. ఆ తర్వాతే పనులను ప్రారంభించామని వివరించారు. 2021 జూలై 23న కాంట్రాక్టర్‌తో ఎల్‌ఓఏ కుదుర్చుకున్నామని, 2022 మా ర్చి 24న పరిహారం ఇప్పించామని, ఇదంతా తమ హయాంలోనే జరిగినట్లు ఆధారాలతో సహా వివరించగలమని తెలిపారు. కానీ కూటమి నాయకులు తమ వల్లే ఆర్‌ఓబీ పూర్తయిందని డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. 2019–24 మధ్య కాలంలో జంట పట్టణాల్లో ప్రారంభమైన పనులన్నీ తుదిదశకు రావడం, వాటిని నేటి పెద్దలు ప్రారంభిస్తూ అభివృద్ధి చేశామంటూ ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement