‘ఎలక్షన్‌ కోడ్‌ పాటించాల్సిందే’ | - | Sakshi
Sakshi News home page

‘ఎలక్షన్‌ కోడ్‌ పాటించాల్సిందే’

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

‘ఎలక్షన్‌ కోడ్‌ పాటించాల్సిందే’

రణస్థలం: ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌ పత్రాలు స్వీకరణ, వాహనాల పార్కింగ్‌, నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో ఇద్దరు వ్యక్తులు మాత్రమే లోపలకు వచ్చేలా చూడా లని చెప్పారు. ఎక్కడా నియమావళి ఉల్లంఘన జరగరాదని ఆదేశించారు. ఎక్కడా ఎక్కువగా జనాలు గుమిగూడి ఉండకుండా 144 సెక్షన్‌ పక్కాగా అమలు చేయాలన్నారు.

‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు’

లావేరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. లావేరులోని ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ప్రజలు ఉండాలని అన్నారు. కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా తగిన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement