● గ్రామీణ ప్రాంతాల్లో రూ.80 పైమాటే
ఘాటెక్కిన
ఉల్లి
కొనలేకపోతున్నాం
ఉల్లి గతంలో కొన్నంత స్థాయి లో కొనుగోలు చేయలేకపోతున్నాం. రూ.65కు కిలో కొనుగోలు చేస్తున్నాం. ధర పెరిగిపోవడంతో వినియోగాన్ని తగ్గించాం. – సుజాత, గృహిణి, శ్రీకాకుళం
ప్రత్యేక కౌంటర్లు ఏవీ?
రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు కనిపించడం లేదు. వెంటనే ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి వినియోగదా రులకు ఉల్లిని తక్కువ ధరకే అందుబాటులోకి తీసు కురావాలి. – సీజు, వినియోగదారుడు, శ్రీకాకుళం
శ్రీకాకుళం:
ఉల్లి ఘాటెక్కింది. రెండు రోజుల కిందటి వరకు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.50 ఉన్న ఉల్లి ఇప్పుడు రూ.55కు చేరింది. రిటైల్‌లో రూ.65 వరకు పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధర ఇంకా పెరుగుతుందని వార్తలు వినిపిస్తుండడం సామాన్యులను భయపెడుతోంది. ప్రస్తుతం 10 టన్నులు ఉల్లికి ఆర్డర్ పెడితే 5 టన్నులు కూడా పంపించడం లేదని రానున్న రోజు ల్లో ఇది మరింత తగ్గుతుందని కర్నాటక, మహారాష్ట్ర వ్యాపారులు చెబుతున్నారని జిల్లాలోని హోల్‌సేల్ ఏజెంట్లు అంటున్నారు. ఇక రైతు బజార్లలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక కౌంటర్లు ఇప్పటికీ కనిపించడం లేదు.
హోల్‌సేల్‌లో
కిలో రూ.55 పలుకుతున్న వైనం


