శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయస్థానాల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో, రూపా యి ఖర్చు లేకుండా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఒక అద్భుత వేదిక అ ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. స్థానిక జిల్లా కోర్టు భవనంలోని సమావేశ మందిరంలో ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మంగళవారం ఆమె అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోటారు వాహన ప్రమాద పరిహార కేసుల్లో బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా బీమా కంపెనీలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు తమ క్లయింట్లకు అవగాహన కల్పించి రాజీకి వీలున్న కేసులను గుర్తించాలని, ఇది న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందని సూచించారు. ఇక్కడ కుదిరిన రాజీకి సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన విలువ ఉంటుందని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని తెలిపారు. ఎటువంటి కోర్టు ఫీజు లేకుండా సమస్యలు పరిష్కరించుకునే ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు


