కిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

కిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను బుధవారం నిర్వహించారు. కుడి తుంటి ఎముక భాగంలో గతంలో జరిగిన శస్త్ర చికిత్స విఫలమై దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌, ఎముక కలవకపోవడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న 69 ఏళ్ల మహిళకు కిమ్స్‌ హాస్పిటల్స్‌ శ్రీకాకుళంలో సంక్లిష్టమైన హిప్‌ రీకన్‌స్ట్రక్షన్‌ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. సుమారు రెండున్నర ఏళ్లక్రితం కుడి తుంటి ఎముకకు ఫ్రాక్చర్‌ కావడంతో సదరు మహిళకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే శస్త్ర చికిత్స అనంతరం కూడా నొప్పి కొనసాగడంతో పాటు, గత ఏడాది కాలంలో నొప్పి క్రమంగా తీవ్రమైంది. నడవడంలో ఇబ్బంది పెరిగి చివరకు వీల్‌చైర్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిశీలించిన కిమ్స్‌ వైద్యులు ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్‌ హాస్పిటల్స్‌ శ్రీకాకుళం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.గూడేన సోమేశ్వరరావు మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం సమన్వయంతో ఇటువంటి క్లిష్టమైన కేసులకు అత్యుత్తమమైన, సమగ్ర వైద్య చికిత్సను అందిస్తున్నామన్నారు. సంక్లిష్టమైన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన డా.రవీంద్ర గుడేనా, ఇతర వైద్య బృందాన్ని కిమ్స్‌ యాజమాన్యం సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement