వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

మందస : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సువర్ణాపురం పంచాయతీ నాతుపురం బొడ్డులూరుకు చెందిన పుచ్చ మీనాక్షీ(40) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి, భాస్కరరావులు దంపతులు. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం మీనాక్షీ భర్తతో మరోసారి గొడవపడింది. దీంతో భాస్కరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్థాపానికి గురైన మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి ఊరి వేసుకుంది. ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement