గంజాయితో ఇద్దరు మహిళలు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయితో ఇద్దరు మహిళలు అరెస్టు

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన పాయల్‌పాల్‌ కలకత్తాలోని గంజాయి వ్యాపారి సమీర్‌దాస్‌తో కలిసి కలకత్తా అటవీ ప్రాంతం కుచ్‌ బీహార్‌ నుంచి గంజాయి రవాణా చేసేంది. దీనికోసం గంజాయి వ్యాపారి గంజాయి రవాణా చేసిన ప్రతిసారి పాయల్‌పాల్‌కు రూ.10 వేలు ఇచ్చేవాడు. ఈవిధంగా కలకత్తా అటవీ ప్రాతం నుంచి పలుమార్లు గంజాయి వ్యాపారి సమీర్‌దాస్‌తో కలిసి గంజాయిని కలకత్తాకు తరలించింది. అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారివురు హౌరాజిల్లా బెల్లి దుర్గాపూర్‌కి చెందిన మౌమఖాల్‌ అలియాస్‌ తనీష అనే మహిళతో కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దిగపొహండి పద్మనాభపూర్‌లో గంజాయి వ్యాపారం చేసే రంజిత్‌కుమార్‌ సాహు వద్దనుంచి12.520 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ముగ్గురూ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి బస్‌ ద్వారా గంజాయితో చేరుకున్నారు. మహిళలిద్దరూ గంజాయి కలిగిన సూట్‌కేస్‌లతో రైల్వేస్టేషన్‌ సమీపంలో వేచి ఉండగా సమీర్‌దాస్‌ టికెట్లు తీసేందుకు వెళ్లాడు. ఈ ఇద్దరు మహిళలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐతో పాటు పట్టణ ఎస్‌ఐ ఎం.ముకుందరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement