‘ఓట్ల తొలగింపు అడ్డుకుందాం’ | - | Sakshi
Sakshi News home page

‘ఓట్ల తొలగింపు అడ్డుకుందాం’

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

నరసన్నపేట: అర్హత కలిగిన ప్రతి ఓటునూ కాపాడుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్‌ సీపీ కార్యాచరణ వేగవంతం చేసిందని, ఏక పక్ష ఓట్ల తొలగింపును అడ్డుకోవడానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు పూర్తి బాధ్యత తీసుకోవాలని పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ కార్యదర్శి హర్హవర్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఒక ప్రైవేటు హోటల్‌లో శ్రీకాకుళం, మన్యం, జిల్లాల వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ ఎస్‌ఐఆర్‌ వార్‌ రూమ్‌ ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశం ఆదివారం పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో హర్షవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వార్‌రూం కార్యక్రమాల సమన్వయంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధానంగా ఓటర్లకు జారీ అవుతు న్న నోటీసులు, వాటికి స్పందించే చట్టబద్ధమైన విధానాలు, సమర్పించాల్సిన ఆధార పత్రాలతో పాటు అబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌(ఏఎస్టీడీ) ప్రక్రియ పై సుదీర్ఘంగా చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.

వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే మనందరి ధ్యేయమని అన్నారు. బూత్‌స్థాయి బీఎల్‌ఏలు, వార్‌రూం ఇన్‌చార్జీలు నిరంతరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని పోలాకి జెడ్పీటీసీ కృష్ణ చైతన్య వివరించారు. సమావేశంలో జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావుతో పాటు నియోజకవర్గ వార్‌రూం ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement