టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన బల్లేడ కూర్మనాయుకులు(62), అతని అల్లుడు బెందాళం రాజేష్‌లు విశాఖపట్నంలో నివాసముంటున్నారు. వీరిద్దరూ ఆదివారం కవిటి మండలం రాజపురంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి విశాఖ వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డు వైపు బోల్తాపడింది. ఈ ఘటనలో కూర్మనాయుకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవింగ్ సీట్‌లో ఉన్న రాజేష్‌కు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.


