శ్రీనివాసరావుకు ఆర్థిక సహాయం | - | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావుకు ఆర్థిక సహాయం

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

శ్రీకాకుళం : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్ట్‌ పైల శ్రీనివాసరావుకు గోవిందనగర్‌ పరిసర ప్రాంతాల ప్రజలు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా రూ.65000 సేకరించి ఆర్థిక సహాయంగా అందించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ బిర్లంగి రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఈ మొత్తాన్ని సేకరించారు. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించి ఈ మొత్తాన్ని అందజేశారు. దాతలు సాయం అందించాలనుకుంటే 73307 00496 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గోవిందనగర్‌ పరిసర ప్రాంతాల వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు, అక్కులపేట ఎంపీటీసీ బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, సాయి శ్రీనివాస్‌ పండా, రోణంకి వెంకటరా వు, జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు నల్లి ధర్మారావు, శాసపు జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాల్‌, సున్నపు చిన్నారావు, సత్యనారాయణ, ఆబోతుల రామ్మోహనరావు, సీపాన రామారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement