వైఎస్సార్‌సీపీలో చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరికలు

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

రణస్థలం: లావేరు మండలంలోని పెద్ద లింగాలవలసకి చెందిన బీజేపీ నాయకుడు బొబ్బాది చిన్నారావు, పైడయ్యవలసకు చెందిన జనసేన నాయకుడు ఈసర్ల శివ వైఎస్సార్‌సీపీలో బుధవారం చేరారు. దీంతో మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పార్టీ కండువా వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితోనే నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ సమష్టిగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, నాయకులు బొబ్బాది శ్రీనివాసరావు, వెంకటరమణ, లుకలాపు చిన్న శ్రీను, ఈసర్ల సూర్యరావు, వలిరెడ్డి భాను, లుకలాపు సుదీర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement